మానవ అక్రమ రవాణా కట్టడికి యుఎస్ కాన్సులేట్ జనరల్‌తో రాష్ట్రాల ఉమ్మడి ఒప్పందం
Representatives of Six Indian States Agree to Work Together to Combat Human Trafficking. మానవ అక్రమ రవాణా.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న క్రైమ్.
By Medi Samrat
మానవ అక్రమ రవాణా.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న క్రైమ్..! ఎంతో మంది అమాయకులు హ్యూమన్ ట్రాఫికింగ్ కు బలయ్యారు. అభం శుభం తెలియని అమాయక పిల్లలు, ఆడపిల్లల జీవితాలు దేశ విదేశాలలోని హ్యూమన్ ట్రాఫికింగ్ నాశనం చేసింది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ ను అడ్డుకోలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ.. ఆరు భారతీయ రాష్ట్రాల ప్రతినిధులు హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్-స్టేట్ మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన మార్గాలను చర్చించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో సమాచార సేకరణ, ఇతర రాష్ట్రాల భాగస్వామ్యం, ఉమ్మడి ప్రయత్నాలపై దృష్టి సారించారు. చట్టపరమైన మద్దతు, సాక్షికి రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి బయటపడిన వారికి పునరావాసం, సంరక్షణపై చర్చించారు. ఇంటర్-స్టేట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయడానికి ప్రతినిధులు అంగీకరించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, కోల్‌కతాలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ సదస్సుకు మద్దతు ఇచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా రాష్ట్రాలు మానవ అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఉమ్మడి ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశాయి. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేసి.. ముందుకు కదులుతున్నామని స్పష్టం చేశారు.
డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరం ఇదేనని చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని ఆమె తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఏహచ్ టియు ఏర్పాటు చేయడమే కాకుండ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చట్టాలపై అవగాహన అవగాహణ కల్పించడంతో పాటు మహిళా కమిషన్ జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ప్రజ్వల ఫౌండేషన్ ను స్థాపించిన పద్మశ్రీ సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. "భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమస్య ఎక్కువగా ఇంటర్-స్టేట్ లేదా ఇంట్రా స్టేట్ రూపంలో ఉంది. అక్రమ రవాణా నిరోధక ప్రయత్నాల్లో రాష్ట్రాల మధ్య సహకారం అవసరం. తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతమైన నాయకత్వంలో జరిగిన ఈ సంప్రదింపులు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భారత సందర్భంలో అత్యుత్తమ చర్యకు మార్గం సుగమం చేసింది. " అని చెప్పుకొచ్చారు. The Southern Regional Consultation to Combat Human Trafficking మీటింగ్ ను జూలై 1-2 తేదీలలో నిర్వహించారు.
మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షతన శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో విమెన్ ట్రాఫికింగ్ పై నిర్వహించిన సదస్సులో పలు నిర్ణయాలపై తీర్మాణాలు ఆమోదించారు.
శక్తి వాహిని సహ వ్యవస్థాపకుడు రిషి కాంత్ మాట్లాడుతూ, "COVID-19 పరిమితులు సడలించినప్పటి నుండి మేము ఇప్పటికే కేసుల పెరుగుదలను చూస్తున్నాము. అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేసిన భయాలు నిజమేనని రుజువవుతోంది. నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేయడం అవసరం. ఏజెన్సీల మధ్య అంతర్రాష్ట్ర సహకారాన్ని తీసుకుని రావాలి, రక్షించబడిన బాధితులకు వారి స్వదేశానికి, పునరావాసానికి సంబంధించి అన్ని సహాయాలు అందించనున్నాం." అని చెప్పారు.