కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి తన జాతకం, గోత్రం మార్చుకున్నారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిస్సహాయతతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. కేసీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అప్పులు చేసి తల్లిదండ్రులు పిల్లలని చదివిపిస్తున్నారని అన్నారు. మాటలకు జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్ మాట్లాడుతున్నారు.. ఇది పనికి మాలిన ప్రభుత్వం అని మండిపడ్డారు.
కేటీఆర్ ఐటీ కింగ్ అంటాడు.. పేపర్ల లీకేజీకి ఆయనే బాధ్యత వహించాలన్నారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని.. విద్యార్థుల ప్రాణాలకి విలువ లేదా? అని ఫైర్ అయ్యారు. TSPSC పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు చావబాధుతున్నారని మండిపడ్డారు. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు మనసులేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తోత్తులుగా ఉంటూ.. విద్యార్థులను కొడతారా? అని నిప్పులు చెరిగారు. మేం అధికారంలోకి రాగానే TSPSC పై విచారణ జరిపిస్తామన్నారు.