తెలంగాణలో మనీ హీస్ట్ మేనియా.. ఇప్పుడెందుకని అనుకుంటున్నారా..?

Red jumpsuit-clad protestors pop up at banks, railway stations with anti-Modi placards. నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ డ్రామా 'మనీ హీస్ట్' లో వారు వేసుకునే ఎరుపు రంగు సూట్స్ ప్రపంచ వ్యాప్తంగా

By Medi Samrat  Published on  2 July 2022 12:46 PM GMT
తెలంగాణలో మనీ హీస్ట్ మేనియా.. ఇప్పుడెందుకని అనుకుంటున్నారా..?

నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ డ్రామా 'మనీ హీస్ట్' లో వారు వేసుకునే ఎరుపు రంగు సూట్స్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ డ్రెస్ లతో కొందరు వ్యక్తులు కనిపించారు. అయితే ఇది ఆ షో ప్రమోషన్స్ కోసమైతే మాత్రం కాదు. మాస్క్‌తో ఎరుపు రంగు జంప్‌సూట్‌లు ధరించి, చాలా మంది వ్యక్తులు జూలై 2 ఉదయం హైదరాబాద్‌లోని బ్యాంకులు, పెట్రోల్ పంపులు, రైల్వే స్టేషన్‌ల బయట కనిపించారు.

రెడ్ జంప్‌సూట్‌లో ఉన్న వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలని చెబుతున్నారు. "మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటాము. మీరు మొత్తం దేశాన్ని దోచుకుంటారు. #ByeByeModi" అనే ఒక సందేశంతో కూడిన ప్లకార్డులను పట్టుకుని వీరంతా వీధుల్లోకి వచ్చారు. ముసుగులు ధరించిన వ్యక్తులు పెట్రోల్ బంక్‌ల వద్ద కనిపించారు. BHEL; BSNL టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్, సికింద్రాబాద్ మరియు కాచిగూడ రైల్వే స్టేషన్లు, ICICI, SBI, PNB బ్యాంకుల బయట.. ఇలా చాలా ప్రాంతాల్లో వారు రోడ్ల మీద కనిపించారు. శనివారం తెల్లవారుజామున మౌనంగా కొంతసేపు వారి నిర్దేశిత ప్రదేశాలలో నిల్చున్నట్లు సమాచారం. పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు ఈ ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా.. క్రియేటివ్ పోస్టర్లతో టీఆర్‌ఎస్ దూకుడుగా ప్రచారం సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోదీ పర్యటనకు ముందు 'మనీ హీస్ట్' ప్రస్తావన రావడం ఇదే మొదటిసారి కాదు. గురువారం ఎల్‌బీ నగర్‌లో మోదీ దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తూ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లో 'మనీ హీస్ట్' పోస్టర్ ఉంది. "మిస్టర్ ఎన్. మోడీ, మేము బ్యాంకును మాత్రమే దోచుకుంటాము, మీరు మొత్తం దేశాన్ని దోచుకుంటారు" అని రాసి ఉంది.

ప్రస్తుతం నగరంలో హోర్డింగ్ వార్ కొనసాగుతోంది. రోడ్ల పక్కన, మెట్రో పిల్లర్ల దగ్గర ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతల ఫోటోలతో కూడిన బీజేపీ హోర్డింగ్‌లు ఉంచబడ్డాయి.
















Next Story