ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు.
By అంజి
ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
హైదరాబాద్: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారని, ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నానని తెలిపారు. ఎవరొచ్చినా చర్చకు సిద్ధమన్నారు. అక్కడే ఎదురుచూస్తామని, సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తామని తెలిపారు.
ఆ తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
ఈ క్రమంలోనే రైతు సంక్షేమంపై చర్చించేందుకు మంత్రులైనా వస్తారని అనుకుంటే సీఎం రేవంత్ ఎవరినీ పంపలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదనిఇ తేలిపోయిందన్నారు. సీఎంకు బూతులు తప్ప రైతుల గురించి మాట్లాడటం రాదన్నారు. ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్‌లో ఉందో కూడా తెలియకుండా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు తన తొత్తులకు పోయాయంటూ దుయ్యబట్టారు.