తెలుగు యూనివర్సిటీ పేరు మార్పునకు సిద్ధం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చేందుకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి  Published on  2 Aug 2024 2:12 PM IST
Telugu University, CM Revanth, Sri Potti Sriramulu Telugu University, Hyderabad, Telangana

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పునకు సిద్ధం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చేందుకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర విముక్తి పోరాటంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారని, వారి రచనలు, గోలకొండ పత్రిక, సాయుధ పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారని అన్నారు. అందరూ అంగీకరిస్తే ఆయన పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

అటు టీమ్‌ ఇండియా క్రికెటర్‌ హమ్మద్‌ సిరాజ్‌కు విద్యార్హత లేకపోయినా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు తోడ్పాటు అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమన్నారు. నిఖత్‌ జరీన్‌కు కూడా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్‌ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మించనున్నట్టు తెలిపారు.

బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, నిన్న స్కిల్స్‌ వర్సిటీకి శంకుస్థాపన చేసిన బేగరికంచెలోనే దీన్ని నిర్మించేందుకు స్థలం ఇస్తామన్నారు. అద్భుతమైన స్టేడియం ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. యూసుఫ్‌గూడ్‌, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌, ఎల్బీ స్టేడియాల్లో క్రీడలు తగ్గి, రాజకీయ కార్యక్రమాలు పెరిగాయని వ్యాఖ్యానించారు.

Next Story