ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Ration Card Distribution From July 26th. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

By Medi Samrat  Published on  15 July 2021 8:12 PM IST
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.


Next Story