వింత వ్యాధితో పశువుల మృత్యువాత.. అజాగ్రత్త వహిస్తే..
Rare Disease Killing Animals In Warangal. అంతుచిక్కని వింత వ్యాధి పశువుల ప్రాణాలు మింగేస్తుందని ఆ గ్రామస్తులంతా
By Medi Samrat Published on
10 April 2021 1:22 PM GMT

అంతుచిక్కని వింత వ్యాధి పశువుల ప్రాణాలు మింగేస్తుందని ఆ గ్రామస్తులంతా ఆందోళనపడ్డారు. పదిహేను రోజుల వ్యవధిలోనే 20 గేదెలు, 2 ఎద్దులు మృతి చెందాయి. దీంతో వాటికి ఏదో వింతవ్యాధి సోకి ఉంటుందని గ్రామస్థులు కంగారుపడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామంలోని ఇలా పశువులు ఉన్నట్టుండి చనిపోతున్నాయి.
ఇప్పటి వరకు 22 పశువులు చనిపోగా, వాటిలో పంట చేనులో నాలుగు పశువులు మృతి చెందాయి. దీంతో వింత రోగం ఏమైవుంటదా అని రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వెటర్నరీ వైద్యురాలు మాట్లాడుతూ.. మృతి చెందిన పశువుల మెదడు లను పరీక్షల నిమిత్తం ముంబయికి పంపించామని.. రిజల్ట్ రావాల్సి ఉందని తెలిపారు.
అయితే.. రేబీస్ వ్యాధి తోనే పశువులు మృతి చెందాయని వెటర్నరీ వైద్యురాలు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలనీ, అ జాగ్రత్త వహిస్తే మనుషులకు కూడ సోకుతుందని చెబుతున్నారు. రైతులకు కూడ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చామని ఆమె తెలిపారు.
Next Story