అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు.ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు

By Medi Samrat
Published on : 8 Jun 2024 11:52 AM IST

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు.ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన శ్వాస తీసుకోడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శనివారం ఉదయం తెల్లవారుజామున 4:50 కు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశాలు వచ్చాయి. రామోజీ రావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story