నిరుద్యోగ యువతకు రామగుండం పోలీసులు గుడ్‌న్యూస్‌

Ramagundam police to give free coaching to police job aspirants. సబ్‌ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని

By Medi Samrat  Published on  29 March 2022 9:55 AM GMT
నిరుద్యోగ యువతకు రామగుండం పోలీసులు గుడ్‌న్యూస్‌

సబ్‌ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని రామగుండం పోలీసు కమిషనరేట్‌ అధికారులు నిర్ణయించారు. వివిధ పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కమిషనరేట్ పోలీసులు, సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (SCCL)తో కలిసి ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో తమ వివరాలను సమర్పించాలని పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగ ఔత్సాహికులకు సీపీ సలహా ఇస్తూ.. కోచింగ్ ప్లేస్, సమయం గురించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు.Next Story
Share it