కేఏ పాల్ ఓడిపోవడంపై రామ్‌గోపాల్ వర్మ స్పందన ఇదే

Ram Gopal Varma's reaction to KA Paul's defeat. మునుగోడు ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పిన కేఏ పాల్ వందల సంఖ్యల ఓట్లతోనే

By Medi Samrat  Published on  6 Nov 2022 1:47 PM GMT
కేఏ పాల్ ఓడిపోవడంపై రామ్‌గోపాల్ వర్మ స్పందన ఇదే

మునుగోడు ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పిన కేఏ పాల్ వందల సంఖ్యల ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ ఓడిపోవడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేఏ పాల్ ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదాలోని తన స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబు పెట్టడానికి ఉపయోగిస్తున్నాడని.. ఇప్పుడే విన్నాను.. హే ప్రజలారా దయచేసి పరిగెత్తండి అంటూ సెటైర్లు వేశారు. మునుగోడులో ఏ పంటలు పండకుండా చూడడానికి, దాని నుండి ప్రజలందరికీ ప్రాణాంతక వైరస్ సోకాలని కేఏ పాల్ యేసుతో కలిసి తనశక్తిని ఉపయోగిస్తున్నాడని కూడా విన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేఏపాల్ ఇక్కడి ఎన్నికల నుండి తరిమివేయబడ్డాడని.. 2024లో కేఏపాల్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడం మంచిదంటూ సూచించారు. ఆపై గెలిచిన తర్వాత అతను మునుగోడు నియోజకవర్గంపై అణుబాంబు వేయగలడు అంటూ కేఏపాల్ పై వరుస ట్వీట్లు చేశారు వర్మ.

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతుండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. పాల్ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా తానే గెలుస్తానని పాల్ చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ కోసం ఆయన ముందుగానే అనుమతి కోరినట్టు తెలుస్తోంది.


Next Story
Share it