వైర‌ల్ అవుతున్న‌ ఆర్జీవీ మ‌రో ట్వీట్‌..

Ram Gopal Varma Tweet Goes Viral. వైర‌ల్ అవుతున్న‌ ఆర్జీవీ మ‌రో ట్వీట్‌..

By Medi Samrat
Published on : 14 Feb 2022 2:37 PM IST

వైర‌ల్ అవుతున్న‌ ఆర్జీవీ మ‌రో ట్వీట్‌..

రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు కొత్తేమీ కాదు..! తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో.. దేవతకు వర్మ విస్కీ ఆఫర్ చేస్తున్నానంటూ పోస్టు పెట్టాడు. కొండా మురళీ, సురేఖా ఇంట్లో తాను దేవతకు విస్కీని ఇస్తున్నానని తెలిపాడు.ఆ ఫోటో తీసే ఆమె కొండా మూవీ నిర్మాత అని వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ పోస్ట్‌ను చూసిన జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి, కొరటాల శివ తదితరులు భేటి కావడంపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. పలువురు స్టార్స్ బిచ్చగాళ్లలా ఏపీ ముఖ్యమంత్రి ముందు నిలుచున్నారని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒమేగా స్టార్ చేశారని అన్నారు.

"సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రామ్ గోపాల్ 'ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా' అంటూ ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికే డిలీట్ చేశారు.


Next Story