గుడ్‌న్యూస్..ఆ సర్టిఫికెట్ అవసరం లేకున్నా రాజీవ్ యువ వికాసం అప్లయ్ చేసుకోవచ్చు
ఈ పథకానికి సంబంధించి ఓ కీలకమైన అప్‌డేట్‌ను ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..ఆ సర్టిఫికెట్ అవసరం లేకున్నా రాజీవ్ యువ వికాసం అప్లయ్ చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఓ కీలకమైన అప్‌డేట్‌ను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దరఖాస్తుదారులకు రేషన్ కార్డు ఉంటే.. ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొంది. రేషన్ కార్డుతో దరఖాస్తు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులో భాగంగా కంపల్సరీ ఇన్‌కమ్ సర్టిఫికెట్ కావాలని మొన్నటి వరకు అడిగారు. దీంతో ఇన్‌కమ్ సర్టిఫికెట్ కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఆయా ఎమ్మార్వో ఆఫీసుల్లో సర్వర్ బిజీగా మారింది. ఈ క్రమంలో సర్టిఫికెట్ల జారీ చాలా నెమ్మదిగా కొనసాగింది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులకు సమస్యలు తలెత్తున్న సందర్భంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, తెల్ల రేషన్ కార్డుతో అప్లయ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయబడతాయి. ఈ పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా ఏప్రిల్ 5, 2025గా నిర్ణయించారు. తాజాగా.. ఈ గడువును ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు.