గుడ్ న్యూస్.. నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు.. ప్రారంభించిన సీఎం

అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

By Medi Samrat
Published on : 17 March 2025 5:30 PM IST

గుడ్ న్యూస్.. నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు.. ప్రారంభించిన సీఎం

అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలివ్వనుంది. ఈ మేర‌కు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు తీసుకోనుంది. ఏప్రిల్ 6 నుంచి మే31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనుంది.

ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గరిష్టంగా 3లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది. కేటగిరి 1, 2, 3 వారీగా రుణాలివ్వనుంది. కేటగిరీ 1 కింద రూ. లక్ష వరకు లోన్ 80 రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.2లక్షల వరకు రుణం 70 శాతం రాయితీ, కేటగిరి 3 కింద రూ. 3 లక్షల లోపు రుణం 60 శాతం రాయితీతో ఇవ్వనుంది.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్​ లిస్ట్​ను ​ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story