సస్పెన్షన్‌ను గ్రహించే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు
Rajagopal Reddy resigned to Congress to escape insult of suspension. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ హైకమాండ్ క్రమశిక్షణా
By Medi Samrat Published on 3 Aug 2022 5:36 PM ISTమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ హైకమాండ్ క్రమశిక్షణా చర్య కింద ఎప్పుడైనా సస్పెండ్ చేయొచ్చని ముందే గ్రహించి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడు దామోదర్‌రెడ్డి సూర్యాపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిచ్చి అవకాశాలు కల్పించిందన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలపై ఆరోపణలు చేసినా క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులుగా మేమున్నాం అని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం కూడా సహనం ప్రదర్శించిందని గుర్తు చేశారు.
"బీజేపీ ప్రభుత్వ కుట్రలో భాగంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలుపునిచ్చినందుకు కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సమయంలో.. రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాజగోపాల్ రెడ్డి చర్య క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధంగా ఉందని" ఆయన అన్నారు. గత ప్రభుత్వాల్లో రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ హైకమాండ్ అనేక అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం "కోమటిరెడ్డి బ్రాండ్" ప్రచారం కోసం ఒక ప్రణాళికతో పనిచేశారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచింది తన సొంత బ్రాండ్‌తో కాదని, కాంగ్రెస్ సభ్యుల చిత్తశుద్ధితో విజయం సాధించామని రాజగోపాల్‌రెడ్డి గుర్తుంచుకోవాలని కోరారు. ఉప ఎన్నికల్లోనూ మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలెవరూ పార్టీని వీడరని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ హైకమాండ్ నిర్ణయానికి పార్టీ నేతలంతా కట్టుబడి ఉండాలనేది కాంగ్రెస్‌లో ఆనవాయితీగా వస్తున్నదని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వయస్సు, పార్టీలో ఉన్న అనుభవంతో నిమిత్తం లేకుండా నేతలందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం అనైతిక చర్య అన్నారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో పనుల కాంట్రాక్టులను పొందిందని అన్నారు.