ఏదో ప్లాన్‌ చేసి రాజకీయాలు చేసేందుకు రాహుల్‌ ఇక్క‌డికి వ‌స్తున్నారు..

Rahul's visit politically motivated. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను క‌లిసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అనుమతి

By Medi Samrat  Published on  4 May 2022 5:07 PM IST
ఏదో ప్లాన్‌ చేసి రాజకీయాలు చేసేందుకు రాహుల్‌ ఇక్క‌డికి వ‌స్తున్నారు..

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను క‌లిసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కె.కవిత బుధవారం కాంగ్రెస్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదని, ఇప్పుడు వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీలకు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని అన్నారు. వరి పంట అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ కోరినప్పుడు కూడా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె అన్నారు.

వరి పంట సమస్య సందర్భంగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తామని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని రాహుల్‌గాంధీకి విన్నవించుకున్నాం.. కానీ చేయలేదని, ఇప్పుడు వరంగల్‌లో ఏదో ప్లాన్‌ చేసి రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి వస్తున్నారని కవిత అన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కోరిన నేపథ్యంలో రాహుల్ గాంధీ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులతో క‌లిసేందుకు అనుమతించబోమని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీని యూనివర్శిటీ ప్రాంగణంలోకి అనుమతించకూడదన్న మా నిర్ణయం అలాగే ఉంటుందని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేందుకు అనుమ‌తించ‌డం లేద‌ని.. గతంలో తీసుకున్న నిర్ణయం అలాగే ఉంటుందని వీసీ రవీందర్ యాదవ్ తెలిపారు.









Next Story