5న తెలంగాణ కు రాహుల్ గాంధీ రాక
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 8:49 PM IST
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారని మహేష్ గౌడ్ తెలిపారు. కుల గణన కు అత్యంత ప్రాధాన్యం ఉన్నందున రాహుల్ వస్తున్నారన్నారు. 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు.
బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంట సేపు మాత్రమే ఉంటారని, కుల గణన లో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించాలి.. కుల ఘనన అత్యంత ప్రాధాన్యతగా కాంగ్రెస్ పార్టీ స్వీకరించిందన్నారు. భారత్ జొడో యాత్ర లో కుల ఘనన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు.
కులగణన ఎన్నో దశాబ్దాల తర్వాత జరుగుతున్నది, కుల ఘనన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇందులో అనేక ప్రశ్నలు పొందుపరచడం జరుగుతోంది.. ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా మరింత లోతుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి చరిత్మాక ప్రాధాన్యత గా ఉన్న కుల ఘనన కు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారాని.. తెలంగాణ కుల ఘనన దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు.