18 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఖైదు చేయబడిన చంచల్‌గూడ జైలును ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ శనివారం సందర్శించారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలు బల్మూరి వెంకట్ మిగతా విద్యార్ధి నాయకులతో రాహుల్ సమావేశమై కాసేపు ముచ్చటించారు. ఏఐసీసీ అధినేత పర్యటన సందర్భంగా చంచల్‌గూడ జైలు వద్ద జై అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఖైదీలకు ములాఖత్ సమయాన్ని కూడా జైలు అధికారులు నిలిపివేశారు. ఖైదీల కోసం ములాఖత్ సమయం కొంత సమయం నిలిపివేయబడింది.
రాహుల్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ములాఖత్ లు కొనసాగుతాయని పేర్కొన్నారు. అయితే.. జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యుఐ నేతలను కలవడానికి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో రాహుల్ గాంధీ, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అనంతరం సీనియర్ నేతలందరితో కీలక సమావేశం నిర్వహించేందుకు గాంధీభవన్‌కు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.