ఓయూలో రాహుల్ గాంధీ సమావేశం.. విద్యార్థి సంఘాలు సహకరించాలి : జగ్గారెడ్డి
Rahul Gandhi Meeting In Osmania University. రాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూలో రాహుల్ గాంధీ సమావేశం ఉంటుందని..
By Medi Samrat Published on 24 April 2022 11:13 AM GMTరాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూలో రాహుల్ గాంధీ సమావేశం ఉంటుందని.. అన్ని సంఘాల విద్యార్థి నాయకులు సహకరించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. గాంధీభవన్ లో ప్రెస్‌మీట్ లో మాట్లాడిన ఆయన.. రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నామని.. వీసీనీ కలిసి సమావేశానికి అనుమతి కొరతామని అన్నారు. అన్ని సంఘాల నాయకులు కూడా విద్యార్ధుల కోసం సహకరించాలని.. అన్ని సమస్యలకూ రాహుల్ పరిష్కారం ఇస్తారని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందని.. విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది అని అన్నారు.
విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేము. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీ కి తీసుకువస్తామని.. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన యూనివర్సిటీకి వస్తారని అన్నారు. యూనివర్సిటీ సందర్శించి.. విద్యార్థులతో చర్చించి.. యూనివర్సిటీ సమస్యలు, ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారని అన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుమానాలు రావడం సహజమని.. అది మా పరిది అంశం కాదని అన్నారు. పీకే సీఎంను కలిసిన విషయం.. సోనియా గాంధీతో కలిసిన అంశాలు మా పరిధి కాదని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు ప్రజల మేలు కోరి పని చేస్తారని.. అధిష్టాన నిర్ణయం ఫైనల్ అని తెలిపారు. పీకే విషయంలో పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు.
కేసీఆర్.. పాలనలో ఫెయిల్ అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన కొట్లడుతున్నామని అన్నారు. బీజేపీ ప్రజల అకౌంట్ లోకి 15 లక్షలు వేస్తా అన్నారని.. అవి ఎవి అని అడుగుతామన్నారు. కేసీఆర్.. లా అండ్ ఆర్డర్ లో విఫలం అయ్యారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ల వైఫల్యాలపై ప్రశ్నిస్తామని తెలిపారు.