Telangana: కాంగ్రెస్ ప్రచారం, దోసలు వేసిన రాహుల్‌గాంధీ (వీడియో)
తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర కొనసాగుతోంది. యాత్రలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఓ దోసల బండి వద్ద దోసలు వేశారు.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 6:41 AM GMTTelangana: కాంగ్రెస్ ప్రచారం, దోసలు వేసిన రాహుల్‌గాంధీ (వీడియో)
తెలంగాణలో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం జరుపుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ బైక్ ర్యాలీల్లో పాల్గొంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు.
కరీంనగర్ వీ-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభం అయ్యింది. జగిత్యాల కార్నర్ మీటింగ్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ముందుకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో నూకపల్లి ఎన్‌ఏసీ స్టాప్ వద్ద రాహుల్ గాంధీ కాసేపు ఆగారు. స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. అక్కడున్న చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. రాహుల్ గాంధీని చూసిన ప్రయాణికులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారితో చెప్పారు.
ఆ తర్వాత రాహుల్‌గాంధీ అక్కడే పక్కన ఉన్న టిఫిన్ బండి వద్దకు వెళ్లారు. దోసలు తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ వ్యాపారితో హాస్యాస్పదంగా మాట్లాడారు. తాను కూడా దోస వేయొచ్చా అని అడిగారు. దానికి ఆ దోసల బండి వ్యాపారి.. దానికేమి భాగ్యం సార్.. వేయండి అంటూ పక్కకు జరిగాడు. అయితే.. రాహుల్ గాంధీ తనకు దోస వేయడం రాదు అని.. నేర్పిస్తావా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, దోస బండి వ్యాపారి మధ్య జరిగిన సంభాషణతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అయితే.. రాహుల్ దోస పిండి తీసుకుని దోసలు వేశారు. దాంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. సభలు, సమావేశాలు అని తిరుగూ ఉంటామని.. తినేందుకు కూడా టైమ్ ఉండదని రాహుల్ చెప్పారు. కాసేపు దోసలు వేసిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి జగిత్యాలకు పయనం అయ్యారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దోసలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
Choppadandi, Telangana Shri @RahulGandhi ji making at dosa dhaba. 🧑🍳😋 pic.twitter.com/in0APWwpvR
— Deepak Solanki (@deepaksolankimp) October 20, 2023