రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారు

Rahul Gandhi comes to Chanchalguda jail and meets student leaders. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  2 May 2022 3:25 PM IST
రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారు

రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చామని అన్నారు. 7వ తేదీన బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది నాయకులను కలవడానికి రాహుల్ గాంధీతో సహా మేమంతా వస్తాం. అందుకు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామ‌ని అన్నారు. జైలు అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.

రాహుల్ గాంధీ ఓయూ పర్యటన పై మా నేతలు విసిని కలిశారని అన్నారు.. విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ గాంధీ రావాలని కోరారని తెలిపారు. కేసీఆర్ ఒత్తడి వల్ల రాహుల్ గాంధీ పర్యటనను తిరస్కరించారని.. ఎన్ఎస్‌యూఐ, విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసి ని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అక్కడికి వెళ్లిన మా విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని ఫైర్ అయ్యారు. ఓయూ లో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారని ప్ర‌శ్నించారు.









Next Story