రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. జ‌గ‌న్‌, విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల బ‌దిలీకి నిరాక‌ర‌ణ‌

Raghu Rama Krishnam Raju petition dismissed by TS High court.అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఎంపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2021 7:10 AM GMT
రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. జ‌గ‌న్‌, విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల బ‌దిలీకి నిరాక‌ర‌ణ‌

అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పై బ‌దిలీకి తెలంగాణ హైకోర్టు నిరాక‌రించింది. సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించ‌కుండా స్టే ఇవ్వ‌డంతో పాటు బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ను మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాలంటూ ర‌ఘురామ మంగ‌ళ‌వారం తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. కేసు బ‌దిలీ చేయాలంటే స‌హేతుక కార‌ణాలు ఉండాల‌ని, అలాంటివేవీ లేకుండా ఊహాజ‌నిత కార‌ణాల‌తో బ‌దిలీ కోరుతున్నార‌ని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పిటిష‌న్ల‌ను కొట్టివేసింది.

దీంతో సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలన్న పిటిష‌న్ల‌పై కాసేప‌ట్లో తీర్పు వెలువ‌డ‌నుంది. దీనిపై సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అక్రమాస్తుల కేసులో జ‌గ‌న్, విజ‌యసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కొన్ని రోజుల క్రితం వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Next Story