స్పృహ తప్పి పడిపోయిన ఆర్. కృష్ణయ్య

R Krishnayya lost consciousness. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పృహ తప్పి పడిపోయారు

By Medi Samrat  Published on  14 Sep 2021 8:43 AM GMT
స్పృహ తప్పి పడిపోయిన ఆర్. కృష్ణయ్య

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పృహ తప్పి పడిపోయారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ లో పనిచేసే గెస్ట్ టీచర్స్ ఆందోళనకు మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య.. ధర్నా కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న క్ర‌మంలో స్పృహ తప్పి పడిపోయారు. ప‌క్క‌నే ఉన్న బీసీ సంఘం నాయకులు కృష్ణయ్యను హుటాహుటిన ఆంధ్ర మహిళా స‌భ‌ ఆసుపత్రికి తరలించిన‌ట్లు స‌మాచారం. కృష్ణయ్య ఆరోగ్యం విష‌య‌మై వివ‌రాలు తెలియాల్సివుంది.

ఇదిలావుంటే.. ఆర్.కృష్ణయ్య 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘంను ఏర్పాటు చేశారు. బీసీ కులాల స‌మ‌స్య‌ల ప‌ట్ల రెండు ద‌శాబ్దాలు పోరాడిన ఆయ‌న‌.. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది గెలుపొంది తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.Next Story
Share it