తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్‌

Puvvada Ajay Tests Corona Positive. తెలంగాణలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. పేద‌-ధ‌నిక‌, చిన్నా-పెద్దా అని తేడా లేకుండా

By Medi Samrat  Published on  15 Dec 2020 5:06 AM GMT
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. పేద‌-ధ‌నిక‌, చిన్నా-పెద్దా అని తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. త‌న‌ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మంత్రి సూచించారు.

"నాకు కరోనా అని తెలియగానే ప్రేమతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన ఆవాసం లేదు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. నాకు ఫోన్ చేయడానికి గాని, కలవడానికి గాని ప్రయత్నించకండి. నా హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. త్వరలోనే యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను" అని మంత్రి ట్వీట్ చేశారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా 491 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 278,599కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి నుంచి 2,69,828 కోలుకోగా.. 7,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 1499 మంది మృత్యువాత ప‌డ్డారు.


Next Story
Share it