ఖమ్మంలో కొత్త షోరూమ్ ప్రారంభించిన ప్యూర్ ఈవీ
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2025 3:00 PM ISTభారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ & సర్వీస్ సెంటర్ 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, బ్రాండ్ యొక్క అధునాతన సాంకేతికతను, ఉన్నత శ్రేణి ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వినియోగదారులకు అద్భుతమైన ప్రాంగణం ను అందిస్తుంది.
ఈ కొత్త షోరూమ్ ప్యూర్ ఈవీ యొక్క పూర్తి ఉత్పత్తి జాబితా ను ప్రదర్శిస్తుంది, పర్యావరణ అనుకూలమైన , స్వచ్ఛమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్ ను తీరుస్తుంది .
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని సహా మరియు ఇతర విశిష్ట అతిథులు, ప్రముఖులు పాల్గొన్నారు . గ్రీన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మరియు ప్రాంతం యొక్క సుస్థిరత లక్ష్యాలకు దోహదపడటంలో కంపెనీ కార్యక్రమాలను అభినందించారు.
ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ రోహిత్ వదేరా ఈ విస్తరణ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఆవిష్కరణ మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల పూర్తి నిబద్ధతతో నడిచే ప్యూర్ ఈవీ తెలంగాణలోని ఖమ్మంలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించడం పట్ల సంతోషం గా ఉంది. ఈ విస్తరణ, ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావాలనే మా లక్ష్యం ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తుంది. కస్టమర్‌లు ఇప్పుడు సుస్థిరత మరియు అత్యాధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మా అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిని సౌకర్యవంతంగా అన్వేషించవచ్చు" అని అన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని మాట్లాడుతూ కొత్త షోరూమ్‌తో ఖమ్మంలో ప్యూర్ ఈవీ తమ కార్యక్రమాలను విస్తరించడం అభినందనీయం. ఈ కార్యక్రమం, వారి అధిక పనితీరు మరియు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా స్వచ్ఛమైన మరియు హరిత భవిష్యత్తు కోసం ప్రభుత్వ లక్ష్యం కు మద్దతు ఇవ్వడానికి బలమైన నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. పర్యావరణ అనుకూల ప్రయాణ పరిష్కారాలను అందించడం ద్వారా, ఈ లక్ష్యం ను నిజం చేయడంలో ప్యూర్ ఈవీ కీలక పాత్ర పోషిస్తోంది" అని అన్నారు.
ప్యూర్ ఈవీ నేడు భారతదేశంలోని టాప్ 10 EV 2 వీలర్ల తయారీదారులలో ఒకటిగా నిలిచింది . అత్యాధునిక బ్యాటరీ సాంకేతికత ద్వారా కంపెనీ పురోగతి సాధిస్తోంది, ఇది కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను ఆకట్టుకునే రీతిలో 96,848 టన్నుల మేరకు తగ్గించడంలో సహాయపడింది.
పర్యావరణ పరిరక్షణ పట్ల దాని కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, ప్యూర్ ఈవీ ప్రస్తుతం ePluto 7G MAX, ePluto 7G, ecoDryft 350, ETRANCE Neo+ మరియు eTryst Xలను అందిస్తోంది. రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను జోడించాలనే లక్ష్యంతో కంపెనీ ఇటీవల ప్రతిష్టాత్మకమైన గ్రోత్ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఈ విస్తరణ దీర్ఘ-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటర్ సైకిళ్ళు మరియు పెద్ద B2B కాంట్రాక్టుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో ప్యూర్ ఈవీ యొక్క నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 320 అవుట్‌లెట్‌లకు పెంచుతుంది.