గర్భగుడిలో మద్యం బాటిళ్లతో పూజలు

Pujas with Liquor bottles in Adelli Pochamma Temple. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో అమ్మవారి గుడిని అపవిత్రం చేశారు.

By Medi Samrat  Published on  27 Aug 2022 10:47 AM GMT
గర్భగుడిలో మద్యం బాటిళ్లతో పూజలు

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో అమ్మవారి గుడిని అపవిత్రం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ పరిధిలోని అడెల్లి పోచమ్మ క్షేత్రంలో ఆలయంలో మద్యం బాటిళ్లతో పూజలు నిర్వహించారు. కొందరు అమ్మవారి గర్భగుడిలో మద్యం ఉంచి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు.

ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ, అధికారులు కానీ స్పందించకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. చేసింది పాపం.. అందులోనూ వారు వీడియోలు తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


Next Story
Share it