20న కొల్లాపూర్‌కు ప్రియాంక గాంధీ.. ఆ స‌భ‌లోనే జూపల్లి స‌హా..

Priyanka Gandhi to address public meeting in Telangana. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా జూలై 20న తెలంగాణలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.

By Medi Samrat  Published on  10 July 2023 5:47 PM IST
20న కొల్లాపూర్‌కు ప్రియాంక గాంధీ.. ఆ స‌భ‌లోనే జూపల్లి స‌హా..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా జూలై 20న తెలంగాణలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ స‌భ‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి తెలిపారు. జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

సభ ఏర్పాట్లపై మీటింగ్ పెట్టామ‌న్నారు. కొల్లాపూర్ సభ ఖమ్మం సభ కంటే విజయవంతం అవుతుందని అన్నారు. బీజేపీలో లుకలుకలున్నాయని కామెంట్ చేశారు. కాషాయం పార్టీలో చాలామంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయన్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేన‌న్నారు. ఎన్ని మాయమాటలు చెప్పిన బీఆర్ఎస్, బీజేపీలను నమ్మరని అన్నారు. 100 సీట్లతో రాష్ట్రంలో 300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ లు ఏర్పడనున్నాయని జోష్యం చెప్పారు. ప్రజా ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.


Next Story