లాస్ట్ లో మోదీ మేనియా ఉండబోతోంది..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం మొదలైంది. బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది.
By Medi Samrat Published on 11 Nov 2023 3:30 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం మొదలైంది. బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ‘ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభ’లో పాల్గొననున్నారు. చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడంతో పాటు హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షో మోదీ పాల్గోనున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 25న కరీంనగర్ సభలో, 26న నిర్మల్ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. 27న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ఎల్బీనగర్ నుంచి పటాన్ చెరు వరకు మోదీ రోడ్ షోకు బీజేపీ ప్లాన్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహాసభలో పాల్గొన్నారు. ఆయన ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్తులు 60శాతం ఉండనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.45కు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుని సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీనేతల సమాచారం. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.