Telangana: రూ.11,355 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో

By అంజి  Published on  3 April 2023 8:45 AM GMT
Prime Minister Modi, Telangana, MMTS, AIIMS

Telangana: రూ.11,355 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడంతో పాటు తెలంగాణలో రూ.11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుండి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మధ్య రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టిన 13వ వందేభారత్ రైలు అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రస్తుతం 12 గంటల ప్రయాణ సమయం 8.5 గంటలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇంకా ప్రారంభించబడని సర్వీస్ రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాల మధ్య నడపబడే రెండవ వందే భారత్ రైలు.

జనవరి 15న, సికింద్రాబాద్, ఏపీలోని ఓడరేవు నగరం విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు సర్వీస్‌ను మోడీ వర్చువల్‌గా ఫ్లాగ్ చేశారు. ఇది రెండు రాష్ట్రాలను కలుపుతూ మొదటిది (వందే భారత్ ఎక్స్‌ప్రెస్).

మరో 40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చే సౌకర్యాలతో కూడిన రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి, ఆధునీకరణ దిశగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా ప్రధాని భూమిపూజ చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న 11,427 చ.మీ విస్తీర్ణం నుండి స్టేషన్ భవన విస్తీర్ణాన్ని 61,912 చదరపు మీటర్లకు పెంచడం ద్వారా స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు ఆధునీకరించడం ఇతర పనులు.

స్టేషన్‌లో టెర్మినల్ భవనం, అన్ని ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే ప్రత్యేకమైన 108-మీటర్ల డబుల్-లెవల్ ఎయిర్ కాన్కోర్స్ కూడా ఉంటుంది.

సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వే లైన్‌లో రూ.1,410 కోట్లతో పూర్తి చేసిన 85 కిలోమీటర్ల డబ్లింగ్‌ పనులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

అనంతరం, ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు నిర్మించిన కొత్త రైల్వే లైన్లపై నడిచే 13 కొత్త మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) సేవలను ప్రధాని ప్రారంభిస్తారు.

పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రూ.7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు.

బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో రూ.1,366 కోట్లతో కొత్త బ్లాకులకు ఆయన భూమిపూజ చేయనున్నారు.

Next Story