రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధవిమానంలో ప్రయాణించారు. సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ఆమె విహరించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సార్టీ నిర్వహించారు. యుద్ధ విమానంలో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. తేజ్‌పూర్ విమానాశ్రయం తవాంగ్ సెక్టార్‌కు దగ్గరగా ఉంటుంది. సుఖోయ్ 30 ఎంకేఐ ట్విన్ సీటర్ ఫైటర్ జెట్. దీన్ని రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ డెవలప్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఫైటర్ జెట్‌ను నిర్మించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు భారత వైమానిక దళం యూనిఫాం ధరించి అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ముర్ము ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 8 వరకు అస్సాంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె పర్యటన సందర్భంగా కాజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023ని ప్రారంభించారు. ఆమె పర్యటన చివరి రోజున తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MK1 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు.