ప్రవళిక ఆత్మహత్య కేసు.. లొంగిపోయిన శివరాం
ప్రవళిక ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారమే అసలు కారణమని అంటున్నారు.
By Medi Samrat
ప్రవళిక ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారమే అసలు కారణమని అంటున్నారు. శివరాం అనే యువకునితో ప్రవళిక ప్రేమలో ఉందని అతను వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవటంతో మోసపోయానన్న బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ప్రవళిక తల్లిదండ్రులు శివరాం అనే యువకుని కారణంగానే ఆత్మహత్య చేసుకుందని.. తమ కూతురు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని ఓ వీడియో విడుదల చేశారు. శివరాంకు కఠిన శిక్ష పడేలా చూడాలని.. అటు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రవళిక కుటుంబం వేడుకుంది.
ప్రవళిక సూసైడ్‌ను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. అప్పటి నుంచి శివరాంను వెతికే పనిలో పోలీసులు ఉండగా నాంపల్లి కోర్టులో శివరాం రాథోడ్ లొంగిపోయాడు. తాను లొంగిపోతున్నట్టు నాంపల్లి కోర్టులో సర్రెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. అందుకు శివరాంకు నాంపల్లి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. నాంపల్లి 9 మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట శివరాం రాథోడ్ లొంగిపోయాడు.