నాగబాబు కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్‌

Prakash Raj Tweet On Nagababu Comments. మెగా బ్రదర్‌ నాగబాబు, సినీనటుడు ప్రకాశ్‌ రాజ్ ‌మధ్య మాట‌లు యుద్దం మొద‌లైన‌ట్లే

By Medi Samrat  Published on  29 Nov 2020 5:39 AM GMT
నాగబాబు కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్‌

మెగా బ్రదర్‌ నాగబాబు, సినీనటుడు ప్రకాశ్‌ రాజ్ ‌మధ్య మాట‌లు యుద్దం మొద‌లైన‌ట్లే క‌న‌బ‌డుతోంది. ఇద్ద‌రూ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్లతో విమర్శలు గుప్పించుకుంటున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు పవ‌న్ క‌ల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భాజ‌పాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న్ను రాజకీయ ఊసరవెళ్లి అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు ధీటుగా స్పందించారు.

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని నాగబాబు అన్నారు. బీజేపీ -జనసేన పొత్తు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయని కానీ అవి ప్రజలు, పార్టీ రెండింటికి ఉపయోగపడేలా ఉంటే ఎంతోమంచిది అన్నారు. మీకు బీజేపీ నచ్చకపోతే విమర్శించండి అందులో తప్పులేదు.. కానీ అదే బీజేపీ లేదా ఇతర పార్టీ అయినా ప్రజలకు మంచి చేస్తే హర్షించాలని సూచించారు. విమర్శించడం తప్ప హర్షించగలిగే మనసులేని మీగురించి ఏం చెప్పగలమంటూ నాగబాబు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు. నాకు తెలుగు భాష వ‌చ్చు.. కానీ మీ భాష రాదు అంటూ వ్యంగ్యంగా విమ‌ర్శించారు. మీ త‌మ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థ‌మైంది. అయితే.. నాకు దేశం మీద ఉన్న ప్రేమ‌ను మీరూ అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వ‌చ్చు. కానీ.. మీ భాష రీదు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు ప్ర‌కాష్ రాజ్‌. మ‌రీ ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story
Share it