ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయబోతున్నట్లు నా దగ్గర సమాచారం ఉంది: కేఏ పాల్

Prajashanthi Party Leader KA Paul Responds On Delhi Liquor Scam. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ స్పందించారు.

By Medi Samrat
Published on : 15 Feb 2023 6:13 PM IST

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయబోతున్నట్లు నా దగ్గర సమాచారం ఉంది: కేఏ పాల్

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరికొందరు దొరుకుతారని.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయబోతున్నట్లు తనవద్ద సమాచారం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతి తారా స్థాయికి చేరిందని విమర్శించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలపై అనవసరంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగించకూడదని ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కోరుతున్నానన్నారు. బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భారత మీడియా సంస్థల లాగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని, వాటిని కనీసం కొనుగోలు కూడా చేయలేరని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మీడియాలతో యుద్ధం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలే అంతర్జాతీయ మీడియాను తట్టుకోలేక పోయారని, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారని సూచించారు.

కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డ ఎన్టీఆర్ లాంటి మహా నాయకులు నేడు లేరని అన్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు, సీఎంలు నరేంద్రమోదీకి బానిసలేనని, ఆయనను ఎదిరించి నిలబడే ధైర్యం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ దళిత, బడుగు బలహీన వర్గాల ద్రోహి అని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ పుట్టినరోజు అయిన ఏప్రిల్14వ తేదీన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.


Next Story