ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్.. భారీగా క్యూకట్టిన జనం
అంబేద్కర్ ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 4:49 AM GMTప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్.. భారీగా క్యూకట్టిన జనం
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చించారు.
మరోవైపు అంబేద్కర్ ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాభవన్‌లో ఇవాళ్టి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ ప్రారంభం అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజాదర్బార్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ తొలి అడుగు అని.. ఇక్కడ నుంచి ప్రజా సమస్యలను విని వాటిని ఎలా పరిష్కరించాలో తేలుస్తామని తెలిపింది.
ప్రజాభవన్ గతంలో ప్రగతిభవన్ వద్ద ఆంక్షలు ఉండేవి. అక్కడ పోలీసుల బారికేడ్లు.. గ్రిల్స్‌తో లోపలికి ఎంట్రీనే ఉండేది కాదు. అయితే.. రేవంత్ ప్రమాణస్వీకారానికి ముందే వాటన్నింటినీ తొలగించారు. ఆంక్షలను ఎత్తివేశారు. డ్రిల్స్‌ను కూడా గ్యాస్ కట్టర్లతో తొలగించే పనులను చేపట్టారు. దాదాపు అన్నింటినీ తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాదర్బార్‌లో తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే ప్రజాభవన్ వద్దకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద భారీగా లైన్లలో జనాలు నిలబడి వేచి చూస్తున్నారు.
ఇక ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. విద్యుత్ సంస్థలో రూ.85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎండీ ప్రభాకర్‌రావుని సమావేశానికి హాజరుఅయ్యేలా చూడాలని అధికారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.
జాభవన్లో ఇవాళ్టి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు.https://t.co/npUXZCGKNG
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 8, 2023