Telangana: ప్రధాని మోదీ పర్యటన వేళ పోస్టర్ల కలకలం
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
By అంజి
Telangana: మోదీ పర్యటన వేళ పోస్టర్ల కలకలం
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వేసిన పోస్టర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని పోస్టర్లలో పేర్కొన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో జరిగిన అన్యాయంపై ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ మీద మోదీది సవతి తల్లి ప్రేమ అంటూ విమర్శిస్తూ పోస్టర్లు వేశారు.
శంషాబాద్ విమానాశ్రయం బయట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్న స్వాగత నిరసనతో పోస్టర్లు అంటించారు. What happened modi అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు వేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది. ? పసుపు బోర్డు ఎక్కడ? మీ హామీలు అన్ని నీటి ముఠా లేనా అంటూ ప్లెక్సీల్లో పేర్కొన్నారు. రావణాసురుడు తలతో మోదీ బ్యానర్‌ని కట్టారు. ఐటిఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్ట్ టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, మిషన్ భగీరథ నిధులు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలలా మోడీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ పోస్టర్లు ఎవరు వేశారు? అన్నది తెలియలేదు. మున్సిపల్ అధికారులు వెంటనే వీటిని తొలగించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ప్రధాని మోదీ తెలంగాణలో ఆదివారం కీలక పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:35 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలు దేరుతారు. 2:10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుండి 2:50 వరకు మహబూబ్‌నగర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు మోదీ చేరుకుంటారు. సాయంత్రం 4:00 గంటల వరకు ఆయన బహిరంగ సభ వద్దే ఉంటారు. సాయంత్రం 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4:45 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. సాయంత్రం 4:50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు.