రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు.. 'మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు'

Posters Against Rajgopal Reddy.తెలంగాణ‌లో రాజ‌కీయాలు మొత్తం ప్ర‌స్తుతం మునుగోడు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 6:13 AM GMT
రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు.. మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు

తెలంగాణ‌లో రాజ‌కీయాలు మొత్తం ప్ర‌స్తుతం మునుగోడు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజ‌గోపాల్ ఈ నెల 21 బీజేపీలో చేర‌నున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించేందుకు ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ త‌మ అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. భువ‌న‌గిరి జిల్లా నారాయ‌ణ‌పురంలో రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా వెలిసిన పోస్ట‌ర్లు క‌ల‌క‌లం రేపుతున్నారు. "రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి. మునుగోడు నిన్ను క్షమించదు " అంటూ పోస్టర్ల‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు స్థానికంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.


మ‌రోవైపు.. తాను రాజీనామా చేయ‌డంతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవగానే సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో అక్కడే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Next Story
Share it