కేఆర్ఎంబీ పాపం కేసీఆర్‌కు ఊరికేపోదు : మాజీమంత్రి
Ponnala Laxmaiah Fires On CM KCR. రాష్ట్రం పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలను కేంద్రం ఏంధుకు అజమాయిషీ చేస్తుందని
By Medi Samrat Published on 13 Oct 2021 6:53 PM IST
రాష్ట్రం పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలను కేంద్రం ఏంధుకు అజమాయిషీ చేస్తుందని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నం, రాష్ట్రం అందుకు ఇస్తున్న అవకాశం కూడా తప్పేనని అభిప్రయపడ్డారు. కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు.. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారని ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి జలయజ్ఞంలో భాగంగా 86 ప్రాజెక్టులు ప్రారంబించామని.. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసామని.. కానీ కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టింది.. ఏమీ లేదన్నారు.
లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల ఏంత లాభం జరుగుతుందో.. కేసీఆర్ చెప్పగలడా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. కేసీఆర్ ఓంటెద్దు పోకడలు.. తెలంగాణకు నష్టం చేస్తున్నాయని అన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే.. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఓక్క ఎకరానికి అయినా నీరు అదించారా..? అని ప్రశ్నించారు. అక్టోబర్ 14న తెలంగాణకు బ్లాక్ డే గా నిలిచిపోతుందని.. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్ కు ఊరికేపోదని అన్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గు లేక పవర్ ప్లాంట్ లు మూతబడ్డాయని.. అనేక రాష్ట్రాలలో పవర్ కట్ లు కొనసాగుతున్నాయని అన్నారు. బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా.. వాస్తవ పరిస్థితి వచ్చే సరికి జనాలకు నిజం తెలుస్తుందని అన్నారు. ఓకే సారి బొగ్గు రేట్లు పెరిగే అవకాశం లేదు. కేంద్రం దగ్గర భవిష్యత్ ప్రణాళిక లేకపోవడమే.. ఇప్పుడు బొగ్గు కొరతకు కారణమని అన్నారు. పాలనను పక్కన పెట్టి, రాజకీయాలపై బీజేపీ దృష్టి సారించిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓక్క మెగావాట్ పవర్ కూడా ఇప్పటి వరకు ఉత్పత్తి చేయలేదని పొన్నాల అన్నారు.