సీఎం కేసీఆర్‌తో పొన్నాల లక్ష్మయ్య భేటీ

మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును

By Medi Samrat  Published on  15 Oct 2023 9:20 PM IST
సీఎం కేసీఆర్‌తో పొన్నాల లక్ష్మయ్య భేటీ

మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సంద‌ర్భంగా పొన్నాల లక్ష్మయ్య, ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం ప‌లికారు. భేటీలో రాష్ట్ర రాజకీయాల గురించి ఇతర అంశాలపై చర్చించిన‌ట్లు తెలుస్తుంది. ఈ భేటీలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల‌ లక్ష్మయ్య పార్టీలోని సీనియర్ నేతలు, బీసీ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల‌ను స్వయంగా కలిసి బీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

Next Story