తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 4:10 PM IST

Telangana, Indiramma Indlu,  PMAYG, Telangana Govt, Ponguleti SrinivasReddy, ShivrajSinghChouhan

తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి 

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అధికారికంగా PMAY-G పథకంలో చేరిందని, గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందని ఆయన పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది 3 లక్షలు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని విన్నవించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ద్వారా 11.57 లక్షల అర్హులైన కుటుంబాలను గుర్తించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు.

Next Story