ఆ జూమ్ కాల్ లో ఏమి మాట్లాడారో.. ఆ పార్టీ గూటికే పొంగులేటి..!

Ponguleti Srinivasareddy Will Join Congress on June 22nd. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు

By Medi Samrat  Published on  17 Jun 2023 10:30 AM GMT
ఆ జూమ్ కాల్ లో ఏమి మాట్లాడారో.. ఆ పార్టీ గూటికే పొంగులేటి..!

ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయిందని అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఏ పార్టీలో చేరబోతూ ఉన్నారా అనే చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. చివరికి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తూ ఉంది. జూన్ 22వ తేదీన ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ప్రస్తుతానికి జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ఆయన కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ జూమ్‌ మీటింగ్‌లోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫిక్స్‌ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారని అంటున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది.

ఈ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ టీం బాగా కష్టపడ్డట్లు తెలుస్తుంది. మొదట వీరు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అలాగే జూపల్లి, కూచుకుళ్ల కూడా కాంగ్రెస్ లో చేరికకే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.


Next Story