చిత్తు కాగితాలు తీసుకుని పోయారు : పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ దాడుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  11 Nov 2023 7:00 PM IST
చిత్తు కాగితాలు తీసుకుని పోయారు : పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ దాడుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కూసుమంచి మండలం జక్కేపల్లి లో ఎన్నికల ప్రచారంలో ఆయ‌న మాట్లాడుతూ.. నేను నామినేషన్ వేయకుండా ఆపడం కోసం ఉదయం ఐదు గంటలకే ఐటీ అధికారులు వచ్చారని అన్నారు. నాకు సంబంధించిన వారి దగ్గర ముప్పై మూడు చోట్ల తనిఖీ చేశారని.. చివరకు చిత్తు కాగితాలు తీసుకుని పోయారని వ్యాఖ్యానించారు.

నేను నామినేషన్ వేయకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసేందుకు నాలాగా గట్టిగా మాట్లాడే వారి నోరు నొక్కడం కోసం ఇట్లాంటి రైడ్లు చేస్తున్నారని అన్నారు. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరన్నారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ.. మీరెన్ని కుట్రలు చేసినా ప్రతిఫలం మీరు అనుభవిస్తారన్నారు.

Next Story