ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిసాయి.

By Medi Samrat  Published on  10 Nov 2023 2:15 PM GMT
ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిసాయి. గత రెండు రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటీ రైడ్స్ కొనసాగాయి. ఖమ్మం హైదరాబాదులో కలిపి మొత్తం 30 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. పొంగులేటి రూం కీస్ లేక పోవడం తో ఐటీ అధికారులు కీస్ కోసం నిరీక్షించారు. జూబ్లీహిల్స్ లో ఉన్న పొంగులేటి ఇంట్లో ఉన్న ఒక రూమ్ కీస్ లేకపోవడంతో కీస్ తీసుకొని రావాలని పొంగులేటి భార్యను అధికారులు సూచించారు.

ఈ సోదాలపై పొంగులేటి స్పందించారు.. ఐటీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన, తన కుటుంబ సభ్యులకు చెందిన 30 కంపెనీల పైన ఐటీ దాడులు చేస్తున్నారని, ప్రభుత్వ ఒత్తిడితోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఈ దాడులు చేయిస్తున్నాయని చెప్పారు. తన అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒంటికాలుపై నిలబెట్టారని ఐటీ అధికారులపై మండిపడ్డారు. పరిధిని దాటి ఐటీ అధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఐటీ రూల్స్ తెలియని వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.

Next Story