రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy joined the Congress in the presence of Rahul Gandhi. ఖమ్మంలో జ‌రుగుతున్న జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

By Medi Samrat
Published on : 2 July 2023 7:34 PM IST

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మంలో జ‌రుగుతున్న జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్‌ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. పొంగులేటి వెంట భారీగా ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం కాంగ్రెస్‌లో చేరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా భుజం తట్టి అభినందించారు. వేదికపై రాహుల్ గాంధీకి ప్రజా యుద్ధ‌నౌక‌ గద్దర్ ముద్దు పెట్టారు.

అంతకుముందు ఖమ్మం సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగగానే రాహుల్ గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం చేస్తూ రాహుల్‌ వేదికపైకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు వేదికపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్‌రావు ఠాక్రే, ఏపీ పీసీసీ భీప్‌ గిడుగు రుద్రరాజు, ఇతర కీలక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.




Next Story