Video: విద్యార్థిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. విచారణకు ఆదేశం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు.

By అంజి  Published on  25 Jan 2024 9:25 AM IST
Policewoman, girl student, Hyderabad,  agriculture university, High Court

Video: విద్యార్థిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. విచారణకు ఆదేశం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు. హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీ భూములను లాక్కోవద్దని నిరసన తెలుపుతున్న విద్యార్థులతో పోలీసులు కాస్తా అతిగా వ్యవహరించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో ఓ విద్యార్థినిని ఇద్దరు మహిళా పోలీసులు బైక్‌పై వెంబడించారు. పరుగెత్తుకుంటూ వెళ్తున్న ఆ విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. ఈ క్రమంలో యువతి కిందపడింది. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో విద్యార్థినిపై జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే సైబరాబాద్ పోలీసులు ఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ నుండి ఒక ప్రకటన ప్రకారం.. కొంతమంది పోలీసు సిబ్బంది అనుచిత చర్యల వీడియో సైబరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చింది. "ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి వివరణాత్మక విచారణ జరుగుతోంది" అని అది పేర్కొంది.

Next Story