Mulugu: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో

ములుగు జిల్లా పస్రా ప్రాంతంలో ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడిపోయి స్పృహా కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టారు.

By అంజి  Published on  5 Aug 2024 12:00 PM IST
Police Officer, CPR , Mulugu, Telangana

Mulugu: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో

ములుగు జిల్లా పస్రా ప్రాంతంలో ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడిపోయి స్పృహా కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఒకరు ఛాతీపై నొక్కుతుండగా.. మరొకరు నొటితో శ్వాసను అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పస్రాలో లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గోడ మీద నుండి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. స్పృహ కోల్పోవడంతో అతడు చనిపోయాడని స్థానికులు అతన్ని పట్టించుకోవడం వదిలేశారు.

కనీసం అతని దగ్గరకు కూడా వెళ్లలేదు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మధు, మధుకర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అతని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్‌ చేయడంతో కాసేపటికి అతను స్ఫృహలోకి వచ్చాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. సీపీఆర్‌ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్‌ను అంతా అభినందిస్తున్నారు.

Next Story