99 కేసులను చేధించిన టాంగో ఇక లేదు

ఎనిమిదేళ్ల క్రితం సిరిసిల్ల పోలీసు శాఖలో చేరిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం టాంగో శనివారం ఉదయం మృతి చెందింది

By Medi Samrat  Published on  13 July 2024 1:07 PM GMT
99 కేసులను చేధించిన టాంగో ఇక లేదు

ఎనిమిదేళ్ల క్రితం సిరిసిల్ల పోలీసు శాఖలో చేరిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం టాంగో శనివారం ఉదయం మృతి చెందింది. 15 హత్యలు, 84 దొంగతనాలు సహా 99 కేసుల్లో నిందితులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది టాంగో. సిరిసిల్లలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో టాంగో చిత్రపటానికి పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్, డాగ్ హ్యాండ్లర్ లక్ష్మణ్‌తో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

గత ఎనిమిదేళ్లలో టాంగో పోలీసు శాఖకు అందించిన సేవలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు. 2017లో ఐఐటీఏ-మొయినాబాద్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చాక జిల్లాకు టాంగోను కేటాయించారు. పోలీసు కుక్క సేవలను ఎస్పీ అభినందించారు. ఎన్నో కేసులను ఛేదించడంలో టాంగో పోలీసులకు సహాయం చేసిందని అన్నారు. టాంగో కు నివాళులు అర్పించే కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story