తెలంగాణలో యూరియా కొరత రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా వచ్చారు. దీంతో రైతులను కట్టడి చేయలేక, స్థానిక పోలీస్ స్టేసన్‌లో సొసైటీ సిబ్బంది రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న ఓ రైతుకు ఫిట్స్ రావడంతో అక్కడ ఆందోళకర పరిస్థితి ఏర్పడింది.
టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి రాజు అనే రైతు సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇతర రైతులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే రావడంతో..ఎవరికి పంపిణీ చేయాలో తెలియక సొసైటీ సిబ్బంది అయోమయంలో పడిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన యూరియా వ్యవహారం పోలీస్ వర్సెస్ రైతులుగా మారిపోయింది.