బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్‌కు షాక్ ఎదురైంది. ఆయనపై పోలీసు కేసు ఫైల్ అయ్యింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్‌ను అనధికారికంగా ఎగుర వేసినందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జూలై 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల మధ్య మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనధికారికంగా డ్రోన్ ఎగురుతున్నందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 223(బీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలి షేక్ జూలై 29న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం ఎఫ్‌ఐఆర్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ పర్యటనలో అనుమతి లేకుండా డ్రోన్లను ఎగురవేశారని కేసు నమోదైంది.
తెలంగాణ ప్రభుత్వానికి మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, అనధికార డ్రోన్ ఆపరేషన్ ప్రజా భద్రతకు ఎంత ప్రమాదకరమో వలి షేక్ తన ఫిర్యాదులో పేర్కొన్నా. సోషల్ మీడియా వినియోగదారులు డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసిన తర్వాత దాని సమస్య గురించి అధికారులకు తెలియజేశారు.