హైదరాబాద్: షాద్‌నగర్ పట్టణ పీఎస్‌లో సునీత అనే దళిత మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన సీఎం రేవంత్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యులు తప్పించుకోలేరని అన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ రంగస్వామి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తన రిపోర్ట్‌ను సీపీకి సమర్పించారు. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. బంగారం దొంగిలించారన్న ఆరోపణలతో బాధిత మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు. 10 రోజులు గడిచినా రిమాండ్ చేయలేదు. తర్వాత ఇంటికి పంపారు. దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలీసు శాఖ.. ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.