కౌశిక్‌ రెడ్డి ఇంటికి హరీష్‌ రావు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ఇంటికి చేరుకున్నాయి.

By అంజి  Published on  5 Dec 2024 5:52 AM GMT
Police, arrest, Harish Rao, Kaushik Reddy, Hyderabad

కౌశిక్‌ రెడ్డి ఇంటికి హరీష్‌ రావు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ఇంటికి చేరుకున్నాయి. అయితే హరీశ్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదు చేస్తే తీసుకోకుండా తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.

నిన్న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పాడి కౌశిక్‌ రెడ్డి హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. తన ఫిర్యాదును తీసుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్‌పై పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉదయమే ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న కౌశిక్‌ రెడ్డి.. బెడ్రూంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్‌ రావు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌశిక్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

Next Story