అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్‌‌ అరెస్ట్‌

Police Arrested Hamara Prasad For Making Controversial Comments On Ambedkar. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్‌

By Medi Samrat
Published on : 10 Feb 2023 8:15 PM IST

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్‌‌ అరెస్ట్‌

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్‌ హమారా ప్రసాద్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ ఓ వీడియో చేసి యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాల్లో ఫిబ్రవరి 9న పెట్టారు. ఆ వీడియో కాస్త వైరల్ కావటంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేశారు. కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ ఆల్వాల్ లోని హమారా ప్రసాద్‌ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

అంబేద్కర్ రాసిన పుస్తకాలపై కూడా హమారా ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అంబేద్కర్ 12 డిగ్రీలు చదివిన గొప్ప వ్యక్తి, మేధావి. ఒక దేశ రాజ్యాంగాన్ని రాశానని చెప్పుకునే మహా మేధావి.. ఒక నాయకుడనే వాడు.. ప్రజలందరినీ సమానంగా చూడాలని అన్నారు హమారా ప్రసాద్. సమాజంలో ఏమైనా లోపాలుంటే వాటిని తొలగించేందుకు కృషి చేయాలి. ఒక మతాన్ని, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ.. అంబేద్కర్ ఓ పుస్తకం రాశారు. నేను గనక ఆయన ఉన్న రోజుల్లో ఈ పుస్తకం చదివి ఉంటే.. మరో గాడ్సే అయ్యేవాన్ని అంటూ హమారా ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు.


Next Story